ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ప్రకటనలకు పెట్టినంత ఖర్చు సైతం సున్నావడ్డీకి వినియోగించలేదు' - రైతులను మోసం చేశారంటూ తెలుగు రైతు అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి ఆరోపణలు

సీఎం జగన్ అసత్య ప్రచారం, అవాస్తవ ప్రకటనలకే పరిమితమయ్యారని మాజీ మంత్రి ఆలపాటి రాజా ఆరోపించారు. రైతులకు సాయం చేస్తున్నట్లు ప్రభుత్వం ఇస్తున్న ప్రకటనలన్నీ అవాస్తవమని తెలుగు రైతు అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు.

tdp leaders allegations on rythu bharosa, alapati raja, marreddy srinivasareddy
రైతు భరోసాపై తెదేపా నేతల విమర్శలు, ఆలపాటి రాజా, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి

By

Published : Apr 20, 2021, 4:17 PM IST

ప్రకటనలకు పెట్టినంత ఖర్చును సైతం సున్నా వడ్డీకి వైకాపా ప్రభుత్వం కేటాయించలేదని మాజీమంత్రి ఆలపాటి రాజా విమర్శించారు. అసత్య ప్రచారం, అవాస్తవ ప్రకటనలకే సీఎం జగన్ పరిమితమయ్యారని తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్​లో నిర్వహించిన మీడియా సమావేశంలో విమర్శించారు. ఈ ప్రభుత్వం ఒక్క కౌలు రైతునీ ఆదుకోకపోగా.. కర్షకులు వెన్నెముక విరిచేస్తోందని ఆరోపించారు. ఎక్కువ ప్రచారం, తక్కువ మంజూరు చేస్తూ సున్నా వడ్డీ పేరిట రైతులను మరోసారి మోసం చేస్తోందని దుయ్యబట్టారు.

ఇదీ చదవండి:బస్సు బోల్తా- ముగ్గురు వలస కూలీలు మృతి

రైతులకు రూ.61,119 కోట్ల సాయం, 51.59 లక్షల మందికి రూ. 13,041 కోట్లు రైతు భరోసా అందించినట్లు.. ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలన్నీ అవాస్తవమని తెలుగు రైతు అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి మండిపడ్డారు. రైతు భరోసా కింద ఒక్కో రైతుకు రూ. 6 వేల చొప్పున కేంద్రం ఇచ్చినవేనని స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వం ఇవ్వాల్సిన రూ. 7,500 పూర్తిగా లబ్ధిదారులకు చేరలేదన్నారు. రూ. 23 వేల కోట్ల ధాన్యం కొనుగోళ్లను.. రైతులకు చేసిన సాయంగా చూపించారని విమర్శించారు. అసత్య ప్రకటనలు ఇచ్చినందుకు వ్యవసాయ శాఖ మంత్రి తక్షణమే రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

'రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details