Varla Ramaiah complaint to NHRC: చిత్తూరు జైలు సూపరింటెండెంట్ వేణుగోపాల్ రెడ్డి ఇంట్లో.. పని మనిషిగా చేసిన ఎస్సీ మహిళ ఉమామహేశ్వరిపై.. అక్రమంగా దొంగతనం కేసు నమోదు చేశారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఎన్హెచ్ఆర్సీ (NHRC)కి ఫిర్యాదు చేశారు. చేయని దొంగతనాని ఒప్పుకోవాలంటూ మహిళపై చేసిన కస్టోడియల్ టార్చర్ ఫిర్యాదుపై జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఎస్సీ మహిళపై దొంగతనం కేసు.. ఎన్‌హెచ్‌ఆర్సీకి వర్ల రామయ్య ఫిర్యాదు - ఎన్‌హెచ్‌ఆర్సీకి వర్ల రామయ్య ఫిర్యాదు
Varla Ramaiah complaint to NHRC: చిత్తూరు జైలు సూపరింటెండెంట్ వేణుగోపాల్ రెడ్డి ఇంట్లో.. పని మనిషిగా చేసిన ఎస్సీ మహిళపై అక్రమంగా దొంగతనం కేసు నమోదు చేశారని.. తెదేపా నేత వర్ల రామయ్య ఎన్‌హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేశారు. చేయని దొంగతనాని ఒప్పుకోవాలంటూ మహిళపై చేసిన కస్టోడియల్ టార్చర్ ఫిర్యాదుపై.. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఎస్సీ మహిళపై అక్రమ దొంగతనం కేసుపై ఎన్‌హెచ్‌ఆర్సీకి వర్ల రామయ్య ఫిర్యాదు
ఉమామహేశ్వరిపై చేసిన చిత్రహింసలను తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపింది.. బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యుల మానవ హక్కులు ఉల్లంఘనకు గురైనట్లు కనిపిస్తున్నాయని పోలీసులను కమిషన్ హెచ్చరించింది. ఐజీ స్థాయి అధికారులతో స్వతంత్ర విచారణ చేపట్టి.. నాలుగు వారాల్లో నివేదిక పంపాలని డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్సీకి నోటిసులు జారీ చేసింది.
ఇవీ చూడండి: