ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రానికి నాలుగో రాజధాని కోసం సీఎం జగన్ వెతుకుతున్నారు: పయ్యావుల

రాష్ట్రానికి నాలుగో రాజధానిగా హైదరాబాద్‌ కోసం జగన్ రెడ్డి వెతుకుతున్నారని ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు. తనకు ఉపయోగపడిన కేసీఆర్‌ రుణం తీర్చుకుంటున్నారని.., వైకాపా నేతలకు మిగిలేది హైదరాబాదే అని మండిపడ్డారు.

రాష్ట్రానికి నాలుగో రాజధాని కోసం సీఎం జగన్ వెతుకుతున్నారు
రాష్ట్రానికి నాలుగో రాజధాని కోసం సీఎం జగన్ వెతుకుతున్నారు

By

Published : Mar 7, 2022, 5:51 PM IST

మూడు రాజధానులు పోయి ఇప్పుడు నాలుగో రాజధానిగా హైదరాబాద్‌ కోసం జగన్ రెడ్డి వెతుకుతున్నారని ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ రుణం తీర్చుకునేందుకు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే దిశగా రాష్ట్ర మంత్రివర్గం పనిచేస్తోందని ధ్వజమెత్తారు. కళాశాలల్లో జరిగే ర్యాగింగ్ కు మించి అసెంబ్లీలో వైకాపా నేతలు బరితెగిస్తుంటే జగన్ వారిపై చర్యలు తీసుకునే స్థితిలో లేరని పయ్యావుల కేశవ్‌ విమర్శించారు.

"వైకాపా వాళ్ల మనసుల్లో ఉన్న రాజధాని హైదరాబాదే. జగన్‌.. తనకు ఉపయోగపడిన కేసీఆర్‌ రుణం తీర్చుకుంటున్నారు. వైకాపా నేతలకు మిగిలేది హైదరాబాదే. వైకాపా నేతలకు రాష్ట్రంలో స్థానం లేదు లేదు. గవర్నర్‌ను గౌరవించలేదని జగన్ బాధపడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. అసెంబ్లీలో ర్యాగింగ్‌ కంటే దారుణంగా వైకాపా నేతలు వ్యవహరిస్తున్నారు. బూతులు తిట్టకుండా జగన్ మంత్రులను కట్టడి చేయాలి. అసెంబ్లీలో చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు వినిపించలేదని సీఎం చెబుతున్నారు. కావాలంటే మేం ఆడియో సీఎం జగన్‌కు పంపుతాం. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సభ్యుడిని సస్పెండ్‌ చేస్తారా ?. కేసీఆర్‌ గత ఎన్నికల్లో జగన్‌కు అన్ని రకాలుగా ఉపయోగపడ్డారు. ఏపీలో వైకాపా గెలిస్తే తెలంగాణలో సంబరాలు జరిగాయి కదా. విభజన చట్టంలో ఏపీకి రావాల్సిన అంశాలపై వైకాపా ప్రభుత్వం మౌనంగా ఉంది. కేసీఆర్‌కు అంత కంటే ఏం కావాలి." - పయ్యావుల కేశవ్, తెదేపా నేత

ABOUT THE AUTHOR

...view details