అరబిందో సంస్థకు భారం పడకుండా ప్రభుత్వమే 108, 104 వాహనాల్లో పరికరాలను కొనుగోలు చేస్తోందని.. తెదేపా నేత పట్టాభి ఆరోపించారు. దాదాపు 46 పరికరాలను ప్రభుత్వమే కొనిస్తోందన్నారు. అలాంటప్పుడు అరబిందోకు రూ. 1.80లక్షలు ఇవ్వడం ఎందుకని ప్రశ్నించారు. 4, 5 టెస్టుల కోసం ఆ సంస్థకు దోచిపెడతారా అంటూ నిలదీశారు. డేటా ఎంట్రీ ఆపరేటర్‌తో టెస్టులు చేయిస్తారా అంటూ ప్రశ్నించారు.
'అన్నీ ప్రభుత్వమే కొంటుంటే ఇక అరబిందో ఎందుకు?' - తెదేపా నేత పట్టాభి
108, 104 వాహనాల్లో పరికరాలన్నీ ప్రభుత్వమే కొని ఇస్తుంటే.. ఇంక అరబిందో సంస్థ ఎందుకంటూ తెదేపా నేత పట్టాభి ప్రశ్నించారు. దాదాపు 46 పరికరాలను ప్రభుత్వమే సమకూరుస్తోందని ఆరోపించారు. దీనికోసం అరబిందోకు రూ. 1.80 లక్షలు చెల్లిస్తారా అంటూ నిలదీశారు.
పట్టాభి, తెదేపా నేత