ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'నూతన పారిశ్రామిక విధానంతో సూక్ష్మ, చిన్నపరిశ్రమలు మూతపడతాయి'

వైకాపా ప్రభుత్వంపై తెదేపా నేత నిమ్మకాయల చినరాజప్ప విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన పారిశ్రామిక విధానం వల్ల చిన్న, సూక్ష్మ పరిశ్రమలు మూతపడే పరిస్థితి రాబోతోందన్నారు.

tdp leader nimmakayala chinarajappa criticises ycp government
నిమ్మకాయల చినరాజప్ప, తెదేపా నేత

By

Published : Aug 12, 2020, 4:36 PM IST

వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన‌ పారిశ్రామిక విధానం 'మ‌సిపూసి మారెడుకాయ' రీతిన ఉందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు నిమ్మకాయ‌ల చిన‌రాజ‌ప్ప విమర్శించారు. ఈ విధానం వ‌లన చిన్న, సూక్ష్మ ప‌రిశ్రమ‌లు మూత‌బ‌డే ప‌రిస్థితి రాబోతోందన్నారు.

తెలుగుదేశం హ‌యాంలో తూర్పుగోదావరి జిల్లా పెట్టుబ‌డుల ఆక‌ర్షణ‌లో రాష్ట్రంలో రెండో స్థానంలో ఉందన్న చినరాజప్ప.. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాల‌న‌లో జిల్లాలో అభివృద్ధి అట‌కెక్కిందని మండిపడ్డారు. పాడైన రోడ్లకు ప్యాచ్ వ‌ర్కులు కూడా చేయ‌లేని దుస్థితి ఉందని విమర్శించారు. అభివృద్ధిని గాలికొదిలేస్తున్నారని మండిపడ్డారు. జిల్లాలో కొవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని.. కేసుల‌కు త‌గ్గ వైద్య స‌దుపాయాల క‌ల్పన‌లో రాష్ట్ర ప్రభుత్వం ఘోర వైఫ‌ల్యం చెందిందని దుయ్యబట్టారు.

ABOUT THE AUTHOR

...view details