ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

టీచర్ కావాలని విద్యార్థులు వేడుకోవడం బాధాకరం: లోకేశ్​ - Lokesh Tweet on Childrens protest at Alluri

Lokesh Tweet on Children's protest: విద్యా వ్యవస్థను నాశనం చేస్తూ తీసుకుంటున్న నిరంకుశ నిర్ణయాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెదేపా నేత నారా లోకేశ్​ డిమాండ్‌ చేశారు. తమ పాఠశాలకు ఉపాధ్యాయుడిని కేటాయించాలని అల్లూరి జిల్లా సలుగులో గిరిజన చిన్నారులు వేడుకోవాల్సిన పరిస్థితి రావడం బాధాకరమన్నారు.

lokesh on Childers protest for teacher in Alluri district
lokesh on Childers protest for teacher in Alluri district

By

Published : Jul 7, 2022, 7:41 PM IST

Lokesh Tweet on Children's protest at Alluri District: అల్లూరి జిల్లా పాడేరు మండలం సలుగు ప్రభుత్వ పాఠశాలకు ఉపాధ్యాయుడిని కేటాయించాలని గిరిజన చిన్నారులు వేడుకున్న ఘటనపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ స్పందించారు. తమ పాఠశాలకు టీచర్​ను కేటాయించాలని చిన్నారులు వేడుకోవాల్సిన పరిస్థితి రావడం బాధాకరమని లోకేశ్​ ట్వీట్​ చేశారు. కంసమామ జగన్ రెడ్డి.. నాడు- నేడు పేరుతో చేస్తున్న పబ్లిసిటీ, రియాలిటీకి ఎంతో తేడా ఉందని ఎద్దేవా చేశారు.

విద్యా వ్యవస్థను నాశనం చేస్తూ తీసుకుంటున్న నిరంకుశ నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని లోకేశ్​ డిమాండ్‌ చేశారు. అన్ని పాఠశాలల్లోనూ విద్యార్థులు - ఉపాధ్యాయుల నిష్పత్తి పాటించాలని సూచించారు. సలుగు పంచాయతీ విద్యార్థుల ఆందోళన తెలుపుతున్న వీడియోను తన ట్విట్టర్​కు జతచేశారు.

ABOUT THE AUTHOR

...view details