Lokesh letter to CM Jagan: సంక్షోభం నుంచి ఆక్వా రంగాన్ని గట్టెక్కించాలని సీఎం జగన్‌కు.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బహిరంగ లేఖ రాశారు. ఆక్వా హాలీడే ప్రకటించకుండా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ చార్జీల పెంపు, రొయ్యల దాణా ధర పెరగడం, రొయ్యల ధర తగ్గడం వల్ల ఆక్వా హాలీడే ప్రకటిస్తున్నామన్న రైతుల నిర్ణయంపై ఇంతవరకూ స్పందించకపోవడం విచారకరమన్నారు.
సీఎం జగన్‌కు లోకేశ్ లేఖ.. తక్షణమే చర్యలకు డిమాండ్ - సీఎం జగన్‌కు తెదేపా నేత నారా లోకేశ్ లేఖ
Lokesh letter to CM Jagan: సంక్షోభం నుంచి ఆక్వా రంగాన్ని గట్టెక్కించాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్‌కు ఆయన లేఖ రాశారు. ఆక్వా హాలీడే ప్రకటించకుండా.. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సీఎం జగన్‌కు నారా లోకేశ్ లేఖ
ప్రతిపక్షనేతగా పాదయాత్రలో ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ రూపాయిన్నరకే ఇస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక.. 2 రూపాయల 36 పైసలు పెంచి దారుణంగా మోసగించారని దుయ్యబట్టారు. 80 శాతం మంది ఆక్వా రైతులకు రాయితీలు ఎత్తేయడం ద్రోహమేనని ధ్వజమెత్తారు. తగిన చర్యలు తీసుకోకపోతే.. పరిశ్రమలు, వ్యవసాయ రంగం దారిలోనే ఆక్వా హాలీడే కూడా తప్పకపోవచ్చని హెచ్చరించారు.
ఇవీ చూడండి: