తిరుమల కొండపై గోవిందనామాలకు బదులు జగన్ నామస్మరణ చేయటం మహా అపరాధమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకశ్ ధ్వజమెత్తారు. సీఎం జగన్ రెడ్డిని రక్షించే గోవిందుడు అంటూ తితిదే ఛైర్మన్ సతీమణి అనడం స్వామి వారికి తీరని కళంకమంటూ ఓ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.
తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకునేందుకు తితిదే ఛైర్మన్గా వైవీ సుబ్బారెడ్డికి ఏడు కొండలవాడి సేవ చేసే అవకాశం దొరికితే.. ఆ స్వామికే అపచారం తలపెట్టే పనులు మంచిది కాదని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.