ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Lokesh : 'ప్రజలు పన్నులు చెల్లించాలని సీఎం నీతి కబుర్లు చెబుతున్నారు'

ముఖ్యమంత్రి జగన్​పై(CM Jagan) తెదేపా నేత నారా లోకేశ్(Nara lokesh) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భార్య పేరుతో ఉన్న ఇంటికి పన్నులు కట్టకుండా ప్రజల్ని పన్నులు(Taxes) చెల్లించమనటం ఏమిటని ప్రశ్నించారు. కరోనా(corona)తో ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకోకుండా అధిక పన్నులు విధించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.

By

Published : Jul 1, 2021, 10:51 PM IST

పన్ను ఎగవేతపై జగన్​పై నారా లోకేశ్ ఆగ్రహం
పన్ను ఎగవేతపై జగన్​పై నారా లోకేశ్ ఆగ్రహం

పన్ను ఎగవేతలోనూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్(CM Jagan) ఏ-1గా నిలిచారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara lokesh) విమర్శించారు. భార్య పేరుతో ఉన్న ఇంటికి జగన్ రెడ్డి పన్ను కట్టకుండా ప్రజల్ని పన్నులు చెల్లించమనటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. స‌కాలంలో ప‌న్నులు చెల్లించి ప్రజ‌లకు ఆదర్శంగా నిలవాల్సిన సీఎం, ధ‌న‌దాహంతో రూ.ల‌క్షల ఇంటి ప‌న్ను ఎగ‌వేయడం విచిత్రంగా ఉందని ఆక్షేపించారు. జ‌గ‌న్ అస్తవ్యస్త పాల‌న‌లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. కరోనాతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అండగా నిలవకుండా అధిక ప‌న్నులు, చెత్తపై ఛార్జీలు వ‌సూలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఈ మేరకు ట్విట్టర్​లో పోస్టు చేశారు.

పన్ను ఎగవేతపై జగన్​పై నారా లోకేశ్ ఆగ్రహం

ABOUT THE AUTHOR

...view details