అకాల వర్షాలకు గోదావరి జిల్లాల్లో భారీగా పంట నష్టం జరిగిందని.. రైతులకు పరిహారం చెల్లించాలని కోరుతూ ముఖ్యమంత్రికి తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ (lokesh letter to cm jagan) రాశారు. రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలకు.. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో(east, west godavari districts affected by floods) చేతికొచ్చిన పంట నేలపాలై రైతులు పడుతున్న ఇబ్బందులను.. లేఖలో వెల్లడించారు.
ఉభయ గోదావరి జిల్లాల్లో అత్యధికంగా పండించే వరి పంటకు.. పెద్ద ఎత్తున నష్టం ఏర్పడిందని తెలిపారు. అప్పులు చేసి.. పెట్టుబడులు పెట్టి, ఇంటిల్లిపాదీ శ్రమించి పండించిన పంట చేతికందే సమయంలో.. వర్షాలకు నీటిపాలై రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వం.. రైతుకు వరికి హెక్టారుకు రూ.25 వేలు, చెరకు రూ.30 వేలు, పత్తికి రూ.25 వేలు, జొన్నకు రూ.15 వేలు, కొబ్బరి చెట్టుకు రూ.3 వేలు, ఆక్వాకు హెక్టారుకు రూ.50 వేలు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.