Lokesh fires on YSRCP: ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, ఆయన పార్టీ నేతలు రాష్ట్రాన్ని రావణకాష్టం చేయడానికే కంకణం కట్టుకున్నారని.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ విమర్శించారు. ప్రజలు అధికారం ఇచ్చింది కబ్జాలు, దోపీడీలు చేయడానికే అన్నట్టు దారుణాలకు తెగబడుతున్నారని మండిపడ్డారు. చిత్తూరు జిల్లా కురబలకోట మండలం కొంగావారిపల్లికి చెందిన వ్యాపారి రమణమ్మని.. స్థానిక అధికార పార్టీ నేత అతి దారుణంగా కొట్టి చంపడం వైకాపా అరాచకాలకు పరాకాష్ట అన్నారు. మహిళలకు సీఎం ఇచ్చే భద్రత ఇదేనా? అని నిలదీశారు. అండగా నిలవాల్సిన ప్రభుత్వమే అంతమొందిస్తుంటే, న్యాయం చేయాల్సిన పోలీసులు అన్యాయంగా వ్యవహరిస్తుంటే.. రాష్ట్ర ప్రజల ప్రాణాలకు దేవుడే దిక్కని లోకేశ్ ట్విటర్ వేదికగా అన్నారు.
రాష్ట్రాన్ని రావణకాష్టం చేయడానికి.. జగన్ కంకణం కట్టుకున్నారు: లోకేశ్ - ఏపీ వార్తలు
Lokesh fires on YSRCP: సీఎం జగన్, ఆయన పార్టీ నేతలు రాష్ట్రాన్ని రావణకాష్టం చేయడానికే కంకణం కట్టుకున్నారని.. తెదేపా నేత నారా లోకేశ్ మండిపడ్డారు. చిత్తూరు జిల్లాలో మహిళ హత్య.. వైకాపా అరాచకాలకు పరాకాష్ట అన్నారు. మహిళలకు సీఎం ఇచ్చే భద్రత ఇదేనా? అని నిలదీశారు.
సీఎం జగన్ రాష్ట్రాన్ని రావణకాష్టం చేయడానికి కంకణం కట్టుకున్నారు:లోకేశ్