ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రతిపక్ష నేతలపై కేసులే ఫ్యాక్షన్ పాలనకు నిదర్శనం: కూన రవికుమార్ - వైకాాపా ప్రభుత్వంపై కూన రవికుమార్ విమర్శలు

ప్రతిపక్ష నేతలపై బనాయిస్తున్న కేసులే జగన్ ఫ్యాక్షన్ పాలనకు రుజువని తెదేపా నేత కూన రవికుమార్ విమర్శించారు. ఆనందయ్య మందును అమ్ముకోవాలని చూసిన ఎమ్మెల్యేని వదిలేసి సోమిరెడ్డిపై కేసులు పెట్టడమేంటని మండిపడ్డారు.

kuna ravikumar
kuna ravikumar

By

Published : Jun 6, 2021, 8:28 PM IST

Updated : Jun 6, 2021, 8:45 PM IST

జగన్మోహన్​రెడ్డి అరాచక, ఫ్యాక్షన్ పాలనకు ప్రతిపక్షనేతలపై పెడుతున్న కేసులే రుజువని తెదేపా సీనియర్ నేత కూన రవికుమార్ ధ్వజమెత్తారు. ఆనందయ్య మందుని అమ్ముకోవాలని చూసిన ఎమ్మెల్యే కాకాణిని వదిలేసి, సోమిరెడ్డిపైకేసు పెడతారా అని నిలదీశారు. మందును ఆన్ లైన్లో అందిస్తామన్న వెబ్ సైట్ నిర్వాహకులను ఎందుకు అరెస్ట్ చేయలేదని కూన ప్రశ్నించారు. ఆనందయ్య మందుతో ప్రభుత్వానికి - కాకాణి గోవర్థన్ రెడ్డికి సంబంధమేమేంటన్న కూన.. మందుకోసం ప్రభుత్వం రూపాయైనా ఖర్చుపెట్టిందా అని మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే సోమిరెడ్డిపై పెట్టిన కేసును వెనక్కితీసుకోవాలని డిమాండ్ చేశారు.

Last Updated : Jun 6, 2021, 8:45 PM IST

ABOUT THE AUTHOR

...view details