కరోనాపై పోరాడే సిబ్బందికి సరిపడా రక్షణ పరికరాలు ఇవ్వకపోగా...ఇచ్చినవి కూడా నాసిరకంగా ఉన్నాయని తెదేపా నేత కాల్వ శ్రీనివాసులు ధ్వజమెత్తారు. కరోనా పేరుతో ఎంఐడీసీ... షార్టు టెండర్లు పిలవకుండానే నామినేషన్ పద్ధతిలో అర్హత లేని వారికి దాదాపు 500 కోట్ల విలువ చేసే ఆర్డర్లు ఎలా ఇచ్చారని ప్రశ్నంచారు. దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని కాల్వ డిమాండ్ చేశారు. అలాగే సీఎం, ఎమ్మెల్యేలు, మంత్రుల విరాళాలపైనా శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సోదరుడి కంపెనీలో డైరెక్టర్‌గా ఉన్న వ్యక్తే.. ర్యాపిడ్ టెస్ట్ కిట్ కొనుగోళ్ల ఆర్డర్ పొందిన కంపెనీలోనూ డైరెక్టర్‌గా ఉన్నారని కాల్వ ఆరోపించారు.
అర్హత లేని వారికి ఆర్డర్లు ఎలా ఇస్తారు?: కాల్వ - tdp leader kalva srinivasulu
రాష్ట్ర ప్రభుత్వం కరోనా విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి తగిన పీపీఈ కిట్లు ఇవ్వకపోగా... ఇచ్చిన ఆ కొన్ని కూడా నాసిరకంగా ఉన్నాయని తెదేపా నేత కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు.
తెదేపా నేత కాల్వ శ్రీనివాసులు