మాజీ మంత్రి దేవినేని ఉమాను.. కృష్ణా జిల్లా నందివాడ పోలీస్ స్టేషన్ నుంచి భారీ భద్రత మధ్య హనుమాన్ జంక్షన్ తరలించారు. దేవినేనిని అరెస్టు చేసిన అనంతరం.. ఉదయం 6 గంటలకు నందివాడ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. అప్పటి నుంచి నందివాడలో హై అలర్ట్ నెలకొంది. దీంతో గ్రామంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దేవినేని ఉమాతో స్టేషన్ నుంచి బయలుదేరిన పోలీస్ కాన్వాయ్‌ను.. అడ్డుకునేందుకు తెదేపా శ్రేణులు యత్నించారు. అయితే భారీగా మోహరించిన పోలీసు బలగాలు వారిని అడ్డుకున్నాయి. భారీ బందోబస్తు మధ్య..ఆయనను కోర్టుకు తరలించారు.
Devineni Uma: భారీ భద్రత నడుమ హనుమాన్ జంక్షన్‌కు దేవినేని ఉమా తరలింపు - తెదేపా నేత దేవినేని ఉమాను హనుమాన్ జంక్షన్‌కు తరలించిన పోలీసులు
తెదేపా నేత దేవినేని ఉమాను..పోలీసులు కృష్ణా జిల్లా నందివాడ పోలీస్ స్టేషన్ నుంచి భారీ భద్రత మధ్య హనుమాన్ జంక్షన్‌కు తరలించారు. నందివాడలో పోలీస్ కాన్వాయ్‌ను తెదేపా శ్రేణులు అడ్డుకునేందుకు యత్నించగా.. భారీగా మోహరించిన పోలీసు బలగాలు వారిని అడ్డుకున్నాయి.
భారీ భద్రత నడుమ హనుమాన్ జంక్షన్‌కు దేవినేని ఉమా తరలింపు