తోడు దొంగలు పరస్పరం సహాయం చేసుకుంటూ... ఆలయాల సంపదను కొల్లగొడుతున్నారని తెదేపా కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చి రాంప్రసాద్ ఆరోపించారు. విజయవాడ దుర్గగుడి అక్రమాల్లో సస్పెండ్ అయిన 15 మందికి వేర్వేరు ఆలయాల్లో పోస్టింగ్ ఎందుకిచ్చారో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
Buchi ram prasad : 'ఆలయాల సంపదను కొల్లగొడుతున్నారు' - minister-vellampalli-srinivas
దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుపై తెదేపా నేత బుచ్చి రాంప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ దుర్గ గుడిలో సస్పెండ్ అయిన అధికారులకు తిరిగి పోస్టింగ్ ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు.
తెదేపా నేత బుచ్చి రాంప్రసాద్
వ్యాక్సిన్ వేయించుకోలేదన్న కారణంతో తితిదే సిబ్బందికి వేతనాలు ఇవ్వకూడదంటూ జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలన్నారు. స్వామివారి సేవా కార్యక్రమాలను స్వచ్ఛందంగా నిర్వర్తించే జాతీయ బ్యాంకులను కాదని, ప్రైవేటీకరించిన స్పెసిఫైడ్ అథారిటీ తీసుకున్న కొత్త నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని హితువు పలికారు.
ఇదీచదవండి.