ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

"విజయసాయి రెడ్డీ.. ఉచితంగా కాలిక్యులేటర్​ పంపిస్తాం!" - విజయసాయి రెడ్డికి తెదేపా నేత అయ్యన్నపాత్రుడి స్ట్రాంగ్​ కౌంటర్

AYYANNA: చంద్రబాబు, లోకేశ్​ దావోస్ పర్యటనల ఖర్చును లెక్కించడానికి ఉచితంగా కాలిక్యులేటర్ పంపుతామని విజయసాయి రెడ్డికి తెదేపా నేత అయ్యన్నపాత్రుడు కౌంటర్​ వేశారు. దావోస్ ఎందుకు దండగ అన్న జగన్ రెడ్డి.. ఏం మొహం పెట్టుకొని వెళ్లారని ప్రశ్నించారు.

AYYANNA
విజయసాయి రెడ్డికి తెదేపా నేత అయ్యన్నపాత్రుడి స్ట్రాంగ్​ కౌంటర్

By

Published : May 23, 2022, 8:06 PM IST

AYYANNA: చంద్రబాబు, లోకేశ్​ దావోస్ పర్యటనలకు ఎంత ఖర్చు అయ్యిందో విజయసాయి రెడ్డి ఓపికగా లెక్కేసుకోవాలని.. కావాలంటే ఉచితంగా కాలిక్యులేటర్ పంపుతామని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు. తెదేపా హయాంలో వచ్చిన పెట్టుబడులు, కంపెనీలు, ఉద్యోగాల వివరాలు వైకాపా ప్రభుత్వమే బయట పెట్టిందని.. బహుశా విజయసాయి రెడ్డి విశాఖ భూకబ్జా పనుల్లో బిజీగా ఉండి చూడలేదేమో అని ఎద్దేవా చేశారు.

భారీ, మధ్య, చిన్న తరహా కలిపి 39వేల 450 పరిశ్రమలు, 5లక్షల13వేల 351 ఉద్యోగాలు వచ్చినట్లు వైకాపా ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిందని గుర్తుచేశారు. దావోస్ ఎందుకు దండగ అన్న జగన్ రెడ్డి.. ఏం మొహం పెట్టుకొని వెళ్లారని ప్రశ్నించారు. మూడేళ్ల నుంచి తెదేపా నాయకుల సంగతి తేలుస్తూనే ఉన్న విజయ సాయిరెడ్డి.. దావోస్​ సదస్సు ప్రారంభం కాకముందే ఫ్యామిలీతో లండన్ టూర్​కి వెళ్లిన జగన్ రెడ్డి సంగతి తేల్చాలని సవాల్‌ విసిరారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details