ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ATCHENNAIDU: రైతులకు ఎవరేమి చేశారో చర్చకు సిద్ధమా?: అచ్చెన్నాయుడు - tdp leader atchennaidu fires on cm jagan

స్వర్ణయుగం ఎలా ఉంటుందో రైతులకు.. చంద్రబాబు చూపించారని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో జరిగిన.. తెదేపా రైతు విభాగం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తెదేపా హయాంలో రైతులకు ఏం చేసిందో చెప్పుకోవడంలో వెనకపడ్డామన్నారు. రైతులను సీఎం జగన్ దగా చేస్తున్నారని దుయ్యబట్టారు.

tdp leader atchennaidu fires on cm jagan
రైతులను సీఎం జగన్ దగా చేస్తున్నారు: అచ్చెన్నాయుడు

By

Published : Sep 8, 2021, 3:23 PM IST

వైఎస్‌ హయాంలో వినిపించిన పంట విరామం.. మళ్లీ జగన్‌ పాలనలో కనిపిస్తోందని తెదేపా(tdp) రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(atchennaidu) విమర్శించారు. రెండున్నరేళ్లుగా రాష్ట్రంలోని ఏ రైతూ సంతోషంగా లేరని ధ్వజమెత్తారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో తెదేపా రైతు విభాగం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. రైతు విభాగం అధ్యక్షుడు, కమిటీ సభ్యులతో ఆయన ప్రమాణం చేయించారు.

రైతులకు.. చంద్రబాబు స్వర్ణయుగం ఎలా ఉంటుందో చూపించారన్నారు. తెదేపా హయాంలో రైతులకు ఏం చేసిందో చెప్పుకోవడంలో వెనకపడ్డామన్నారు. రైతులను సీఎం జగన్ దగా చేస్తున్నారని దుయ్యబట్టారు. తెదేపా రైతులకు ఏం చేసింది.. వైకాపా ప్రభుత్వం ఏమి చేసిందనే దానిపై చర్చకు తాము సిద్ధమని అచ్చెన్న సవాల్‌ చేశారు.

ABOUT THE AUTHOR

...view details