ఆంధ్రప్రదేశ్

andhra pradesh

దళితాభ్యుదయవాది స్మృతికి... చంద్రబాబు, లోకేశ్​ నివాళులు

బాలయోగి జయంతి సందర్భంగా దళితాభ్యుదయవాది స్మృతికి తెదేపా అధినేత చంద్రబాబు, నారా లోకేశ్​ నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాలకు స్ఫూర్తిదాయక సేవలందించారని కొనియాడారు.

By

Published : Oct 1, 2022, 3:53 PM IST

Published : Oct 1, 2022, 3:53 PM IST

Chandrababu
చంద్రబాబు

బడుగు, బలహీన వర్గాలకు స్ఫూర్తిదాయకమైన సేవలందించిన తెదేపా నేత, తొలి దళిత స్పీకర్​గా దేశ రాజకీయాల్లో ధ్రువతారగా వెలిగిన గంటి మోహన చంద్ర బాలయోగి జయంతి సందర్భంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్​ నివాళులర్పించారు. బాలయోగి స్ఫూర్తితో ఎస్సీల అభివృద్ధికి పునరంకితమవుదామని చంద్రబాబు ఆకాంక్షించారు. సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్యుడిగా ఉన్నత శిఖరాలను అధిరోహించిన వ్యక్తి బాలయోగి అని లోకేశ్‌ పేర్కొన్నారు. తొలి దళిత లోక్​సభ స్పీకర్​గా ఆయన చరిత్ర సృష్టించారన్నారు. తనని ఆదరించిన ప్రాంతాన్ని అభివద్ధి చేసి కోనసీమ ముద్దుబిడ్డగా ప్రజల మనస్సులో చెరగని ముద్ర వేసుకున్నారని లోకేశ్‌ కొనియాడారు.

ABOUT THE AUTHOR

...view details