TENSION AT VIJAYAWADA : నివాసాల మధ్యలో ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని తొలగించాలంటూ మహిళలు ఆందోళనకు దిగారు. విజయవాడలోని అజిత్‌సింగ్ నగర్లో ఏర్పాటు చేసిన దిల్ ఖుష్ బార్ అండ్ రెస్టారెంట్‌ను తొలగించాలని తెదేపా, ఐద్వా మహిళా సంఘాల నేతలు నిరసనకు దిగారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు చెందిన మద్యం దుకాణం కావటంతో భారీగా పోలీసులను మోహరించారు. ఆందోళనకు దిగిన మహిళా నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఠాణాకు తరలించారు. దీంతో అజిత్‌సింగ్ నగర్లో ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల పహారా మధ్యలో బ్రాందీ షాపు నిర్వహించడం సిగ్గుచేటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నివాసాల మధ్య మద్యం షాపు తొలగించాలని మహిళల నిరసన.. అరెస్ట్ - aidwa leaders protest
POLICE SECURITY AT BAR IN VIJAYAWADA : ప్రజలు నివసించే ఇళ్ల మధ్యలో ఉన్న మద్యం దుకాణాన్ని తొలిగించాలని తెలుగుదేశం పార్టీ, ఐద్వా మహిళా సంఘాల నాయకులు ఆందోళన నిర్వహించారు. ఆందోళనకు దిగిన మహిళా నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. స్టేషన్‌కు తరలించారు.
POLICE SECURITY AT BAR IN VIJAYAWADA