ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Atchenna: దేవినేనికి హాని తలపెట్టేందుకే జైలు సూపరింటెండెంట్ బదిలీ: అచ్చెన్న - దేవినేని అరెస్టుపై అచ్చెన్న కామెంట్స్

దేవినేని ఉమకు ఎలాంటి హాని జరిగినా ప్రభుత్వామే పూర్తి బాధ్యత వహించాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. ఉమకు హాని తలపెట్టేందుకే రాజమహేంద్రవరం జైలు సూపరింటెండెంట్​ను బదిలీ చేశారన్నారు.

TDP Achenna comments on devineni arrest
దేవినేనికి హాని తలపెట్టేందుకే జైలు సూపరింటెండెంట్ బదిలీ

By

Published : Jul 30, 2021, 8:10 PM IST

దేవినేని ఉమకు హాని తలపెట్టేందుకే రాజమహేంద్రవరం జైలు సూపరింటెండెంట్​ను బదిలీ చేశారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. జైలు సూపరింటెండెంట్ బదిలీపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కొండపల్లిలో అక్రమ తవ్వకాలు ప్రశ్నించినందుకే ఉమపై దాడి చేశారన్నారు. రాజకీయ కక్షతోనే ఉమపై తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపారన్నారు. దేవినేని ఉమకు ఎలాంటి హాని జరిగినా ప్రభుత్వామే పూర్తి బాధ్యత వహించాలని అచ్చెన్న డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details