మహిళలపై రోజురోజుకు దాడులు ఎక్కువైపోతున్నాయి. ఆడపిల్లలను బయటకు పంపించాలంటేనే తల్లిదండ్రులు హడలిపోతున్నారు. ఇలాంటి దాడులకు 90శాతం కారణమైన మద్యాన్ని నిషేధించి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ప్రకాశం జిల్లా ఒంగోలులో ఐద్వా ఆధ్వర్యంలో విద్యార్ధినిలు ర్యాలీ నిర్వహించారు. మానవహారం చేపట్టి దుర్మార్గులను శిక్షించాలంటూ నినాదాలు చేశారు. కర్నూలు రోడ్డు వంతెన నుంచి చర్చి కూడలి వరకు సాగిన ఈ ర్యాలీలో ప్రజాసంఘాలు, విద్యార్ధినీలు పాల్లొన్నారు. తల్లి పక్కన ఉన్న చంటిబిడ్డలకు కూడా రక్షణ లేనటువంటి స్థితిలో దేశం ఉందని, నిర్భయ లాంటి చట్టాలు ప్రభుత్వం పటిష్ఠంగా అమలు చేయాలని, అశ్లీల చిత్రాలు, వెబ్ సైట్లను నిషేధించాలని ఐద్వా నాయకురాలు రమాదేవి డిమాండ్ చేశారు
మహిళలపై దాడులను నిరసిస్తూ ప్రజాసంఘాల ర్యాలీ - arrasments
మహిళలపై జరుగుతున్న వరుస దాడులకు నిరసనగా ప్రకాశం జిల్లా ఒంగోలులో ఐద్వా ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మద్యపానమే ఈ దాడులకు ముఖ్య కారణమని, మద్యాన్ని నిషేధించాలంటూ విద్యార్ధులు, ప్రజాసంఘాల కార్యకర్తలు రోడ్డెక్కారు.
ర్యాలీ నిర్వహిస్తున్న ప్రజాసంఘాలు