ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దసరా రద్దీ.. అధిక ఛార్జీలు వసూళ్లు చేస్తే కఠిన చర్యలు: రవాణాశాఖ - రవాణా శాఖ సంయుక్త కమిషనర్ ఎస్​ వెంకటేశ్వరరావు

దసరా పండుగ రద్దీ దృష్ట్యా ప్రయాణికులపై ప్రైవేటు ట్రావెల్స్ అధిక ఛార్జీలు వసూళ్లు చేస్తే కఠిన చర్యలు తప్పవని రవాణా శాఖ సంయుక్త కమిషనర్ ఎస్​ వెంకటేశ్వరరావు హెచ్చరించారు. దసరా సీజన్ మొత్తం ప్రత్యేక డ్రైవ్​ కొనసాగుతుందన్నారు. పన్నులు ఎగ్గొట్టే ట్రావెల్స్​ వారిపై కఠినంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.

ప్రయాణికులు
ప్రయాణికులు

By

Published : Oct 4, 2021, 10:22 PM IST

దసరా పండుగ సందర్భంగా సొంతఊళ్లకు వెళ్లే ప్రయాణికుల నుంచి ప్రైవేటు ట్రావెల్స్​ అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ సంయుక్త కమిషనర్ ఎస్​. వెంకటేశ్వరరావు హెచ్చరించారు. దసరా పండుగ రద్దీ దృష్ట్యా ప్రైవేటు ట్రావెల్స్​ అధిక ఛార్జీల వసూళ్లపై ఫిర్యాదులు రావడంతో ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటివరకు ప్రైవేటు ట్రావెల్స్ వాహనాలపై వందకు పైగా కేసులు నమోదు చేశామన్నారు.

దసరా సీజన్ మొత్తం ప్రత్యేక డ్రైవ్​ కొనసాగుతుందన్నారు. పన్నులు ఎగ్గొట్టే ట్రావెల్స్​పై కఠినంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. వెబ్ సైట్ల ద్వారా అధిక ఛార్జీలు వసూలు చేస్తే తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రైవేట్​ ట్రావెల్స్​ వారు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని సూచించారు. ఎక్కువగా ఛార్జీలు వసూలు చేస్తే రవాణా శాఖ వెబ్​సైట్​లో పొందుపరచిన డీటీసీలకు నేరుగా ఫోన్ చేసి ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు.

ఇదీ చదవండి:ACHENNAIDU: 'విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకూ పోరాటం చేస్తాం'

ABOUT THE AUTHOR

...view details