ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'లారీ యజమానుల నుంచి మామూళ్ల వసూళ్లను ఆపాలి' - విజయవాడ

లారీ యజమానుల నుంచి ఎగుమతి, దిగుమతి కూలి, మాముళ్లు, ఇతర ఛార్జీల వసూళ్లను నిలిపివేయాలని 'ది ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్​' డిమాండ్ చేసింది. గతంలో ఇటువంటి వ్యవస్థ ఉండేది కాదని, ఇప్పుడు టన్నుకు, బస్తాకు డిమాండ్ చేసే పరిస్థితి ఏర్పడిందని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఈశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు.

lorry owners
లారీ యజమానులు

By

Published : Jul 29, 2021, 4:21 PM IST

లారీ యజమానుల నుంచి ఎగుమతి దిగుమతి కూలి, మాముళ్లు వసూలు, గుమస్తా రుసుములు, ఆశీలు, కాటా ఛార్జీలను నిలిపివేయాలని 'ది ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్​' డిమాండ్ చేసింది. గతంలో ఇటువంటి వ్యవస్థ ఉండేది కాదని, ఇప్పుడు టన్నుకు, బస్తాకు డిమాండ్ చేసే పరిస్థితి ఏర్పడిందని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఈశ్వరరావు వాపోయారు.

కిరాయి ఇచ్చే సమయంలో సరకు యజమాని గుమస్తా రుసుం పేరుతో 2 నుంచి 4 శాతం వరకు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. దీన్ని అరికట్టాలని ఆల్ ఇండియా లారీ ఓనర్స్​ అసోసియేషన్ ఆదేశాలతో తాము రాష్టంలో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఈశ్వరరావు తెలిపారు. కొవిడ్​తో ఇప్పటికే కుదేలైన లారీ యజమానులు ఈ రుసుముల కారణంగా మరింత ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. దీనిని అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ది ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు స్పష్టం చేశారు. అన్ని జిల్లా లారీ అసోసియేషన్లకు దీనిపై అవగాహన కల్పిస్తామని తెలిపారు.

ఇదీ చదవండి:'విశాఖ ఉక్కుపై అసత్య ప్రచారాన్ని నమ్మవద్దు'

ABOUT THE AUTHOR

...view details