రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం సోదరులు బక్రీద్‌ను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచి ఈద్గాలకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బక్రీద్ పండుగ త్యాగానికి ప్రతీకగా భావిస్తారు. బక్రీద్ ముస్లిం క్యాలెండర్లో చివరి నెల అయిన ధు అల్- హిజాహ్ పదో రోజన ఈద్ అల్ అద్హాను జరుపుకుంటారు. అదే సమయంలో హజ్ యాత్ర జరుగుతుంది. బక్రీద్ ముందు రోజు ముస్లింలు మరణించిన వారి సమాధుల వద్ద వారికి ఇష్టమైన దుస్తులు, ఆహార పదార్థాలను ఉంచుతారు. ఇలా చేయడం వల్ల వారు స్వర్గం నుంచి వాటిని స్వీకరిస్తారని నమ్ముతారు.
విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. పార్టీలకతీతంగా రాజకీయ నాయకులు ప్రార్థనలో పాల్గొని బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.
కడప జిల్లా మైదుకూరులో బక్రీద్ సందర్భంగా మత గురువు ఫజుల్ రెహమాన్ సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున్న ముస్లింలు పాల్గొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.