'అమరావతి రైతుల మరణాలు ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే' - ఏపీలో సిట్ వివాదం
రాజధాని ప్రాంతంలో రైతుల మరణాలు ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే అని... ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ఆరోపించారు. రాజధానిగా అమరావతినే కొనసాగిస్తూ విశాఖను అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు.
రాజధాని రైతులు, మహిళల పట్ల వైకాపా ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తిస్తోందని... రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి ఆరోపించారు. అమరావతిలో 66 రోజులుగా కొనసాగుతున్న నిరసనల్లో సుమారు 28 మంది రైతులు, రైతు కూలీలు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే అని పేర్కొన్నారు. రాజధానిగా అమరావతినే కొనసాగిస్తూ విశాఖను అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్(స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్)ను జిట్(జనరల్ ఇన్వెస్టిగేషన్ టీమ్)గా తులసిరెడ్డి అభివర్ణించారు.