ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CJI JUSTICE NV.RAMANA: నేడు సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణకు ప్రభుత్వం తేనీటి విందు - CJI

CJI JUSTICE NV.RAMANA: నేడు విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తేనీటి విందుకు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ హాజరుకానున్నారు. నిన్న గుంటూరు జిల్లాలో పర్యటించిన సీజేఐ.. పొన్నూరులోని వీరాంజనేయస్వామి ఆలయం, సహస్ర లింగేశ్వరస్వామి ఆలయాలను సందర్శించి, ప్రత్యేక పూజలు చేశారు.

సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ
సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

By

Published : Dec 25, 2021, 7:42 AM IST

CJI JUSTICE NV.RAMANA: నేడు విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తేనీటి విందుకు సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ హాజరవుతారు. ఈ విందులో సీఎం జగన్‌ పాల్గొననున్నారు. ఈ మేరకు మంత్రులను సీజేఐ, జడ్జిలకు పరిచయం చేయనున్నారు.

ఆలయాల్లో ప్రత్యేక పూజలు..

నిన్న గుంటూరు జిల్లా పొన్నూరులోని వీరాంజనేయస్వామి ఆలయం, సహస్ర లింగేశ్వరస్వామి ఆలయాలను సీజేఐ జస్టిస్​ ఎన్వీ రమణ సందర్శించారు. రెండు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామానికి వెళ్లారు. శ్రీ భగళాముఖి అమ్మవారి ఆలయంలో జరిగిన చండిహోమంలో సీజేఐ దంపతులు పాల్గొన్నారు.

ఆ తర్వాత పెదనందిపాడులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు నివాసంలో విందుకు హాజరయ్యారు. ఈ విందులో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ గంటకుపైగా అక్కడ ఉన్నారు. పెదనందిపాడు నుంచి రాత్రి 12 గంటల సమయంలో విజయవాడ బయలుదేరి వెళ్లారు. ఈ ఉదయం జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుంటారు.

అనుబంధ కథనాలు..

ABOUT THE AUTHOR

...view details