తిరుపతి ఉప ఎన్నికకు ముందు భాజపా రాష్ట్ర నేతలపై వైకాపా ఎంపీ విజయసాయి తీవ్ర విమర్శలు చేశారు. భాజపా డ్రామాలకు జనం నవ్వుకుంటున్నారని విజయసాయి ట్వీట్ చేశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. ఈ ట్వీట్ కు ఘాటుగా స్పందించారు. "మేం ఏం ఇచ్చామో చెప్పి ఎన్నికల్లో గెలుస్తాం" అని ధీమా వ్యక్తం చేశారు.
గెలిచాక విజయసాయికి క్యాబేజీ పూలు పంపిస్తామన్నారు. కోర్టులను తప్పుదోవ పట్టిస్తూ.. విజయసాయి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని.. బెయిల్ రద్దవగానే క్యాబేజీ పూలు కూరకు లోపల పనికొస్తాయని అంటూ.. సోము వీర్రాజు ఎద్దేవా చేశారు.