Social Welfare Residence School Entrance Exam Results: సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి సంబధించిన పరీక్షా ఫలితాలను ఆ శాఖ మంత్రి మేరుగ నాగార్జున సచివాలయంలో విడుదల చేశారు. 5, 11 తరగతుల్లో ప్రవేశానికి సంబంధించి పరీక్షా ఫలితాలను ఆయన విడుదల చేశారు. ఈ వివరాలను ఆన్ లైన్ లో ఉంచుతున్నట్టు మంత్రి తెలిపారు. ఎస్సీ గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి 61 వేల మంది విద్యార్ధులు పరీక్ష రాసినట్టు మంత్రి వెల్లడించారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల పట్ల వహించని శ్రద్ధ ఏపీ ప్రభుత్వం తీసుకుంటోందని మంత్రి వ్యాఖ్యానించారు. ఎస్సీ హాస్టళ్లు, గురుకులాల్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించి ముందుకు వెళ్తామన్నారు. పేదపిల్లలు చదువుకునే పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడతామంటే తెదేపా కోర్టుకు వెళ్లి అడ్డుకుందని ఆయన ఆరోపించారు. 12 కేసులు ఉన్న వ్యక్తి మాత్రమే తన వద్ద అప్పాయింట్ మెంట్ తీసుకోవాలని తెదేపా నేత లోకేశ్ చెప్పటం దారుణమన్నారు.
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల - Social Welfare Residence School Entrance Exam Results
Social Welfare Residence School Entrance Exam Results: సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి సంబధించిన పరీక్షా ఫలితాలను ఆ శాఖ మంత్రి మేరుగ నాగార్జున సచివాలయంలో విడుదల చేశారు. 5 , 11 తరగతుల్లో ప్రవేశానికి సంబంధించి పరీక్షా ఫలితాలను ఆయన విడుదల చేశారు.
minister-nagarjuna