కర్ఫ్యూ ప్రారంభానికి ముందు విజయవాడ నగరంలోని దుకాణాలు, రైతు బజార్లు, మద్యం దుకాణాలు రద్దీగా మారాయి. మధ్యాహ్నం 12గంటల లోపు తమతమ విధులు, పనులు పూర్తి చేసుకునేందుకు నగరవాసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో ప్రతిచోటా హడావుడి వాతావరణం నెలకొంది. నగరంలోని ప్రధాన రహదారులు సైతం 12 గంటల వరకూ రద్దీగా కనిపించాయి.
విజయవాడలో రద్దీగా దుకాణాలు
విజయవాడ నగర వాసులతో దుకాణాలు రద్దీగా మారాయి. మధ్యాహ్నాం 12 గంటలు దాటిన తరువాత నుంచి కర్ఫ్యూ అమల్లోకి రావటంతో... అంతకుముందు అవసరమైన వస్తువులు, నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు ప్రజలు రహదారులపైకి వచ్చారు. ఈ కారణంగా.. అటు దుకాణాలు.. ఇటు నగర రహదారులు రద్దీగా దర్శనమిచ్చాయి.
విజయవాడలో రద్దీగా మారిన దుకాణాలు