ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అసెంబ్లీ సీట్ల పెంపుపై కదలిక.. నిజమేనా? - proper note

ఉమ్మడి రాష్ట్రం విడిపోయిననాటి నుంచి.. తెలుగు రాష్ట్రాల్లో శాసనసభ స్థానాల పెంపుపై చర్చ నడుస్తోంది. ఈ దిశగా కీలక అడుగు పడినట్టు.. తాజాగా సమాచార హక్కు దరఖాస్తు వెలుగులోకి తెచ్చింది.

ఈసీ

By

Published : Jul 24, 2019, 8:58 PM IST

తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల పెంపు విషయం.. మరోసారి చర్చనీయాంశమైంది. విభజన నాటి నుంచి.. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు, పార్టీల నేతలు సందర్భం వచ్చినప్పుడల్లా శాసనసభ స్థానాల పెంపుపై ప్రస్తావిస్తూ వచ్చారు. రాజ్యాంగం ప్రకారం ఇప్పట్లో అలాంటి అవకాశం లేదని కేంద్రం పెద్దలు బదులిచ్చిన వార్తలూ వచ్చాయి. కానీ.. ఓ సమాచార హక్కు దరఖాస్తు.. తాజాగా కొత్త విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఎమ్మెల్యే సీట్ల పెంపు దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతూ... ఈ ఏడాది ఏప్రిల్ లోనే.. ఎన్నికల సంఘానికి కేంద్రం నోట్ పంపిన విషయం బయటపెట్టింది. ఈ మేరకు... ఆంధ్రప్రదేశ్​లో 175 నుంచి 225కు.. తెలంగాణలో 119 నుంచి 153 కు శాసనసభ స్థానాలు పెంచాలని ఎన్నికల సంఘానికి కేంద్రం నోట్ పంపినట్టు స్పష్టమైంది. ఇందుకు సీఈసీ కూడా బదులిచ్చిందట. ఆ నోట్ సరిగా లేదని.. పూర్తి వివరాలతో.. సరైన సమాచారంతో మరోసారి పంపాలని.. కేంద్ర హోం శాఖకు సూచించిందట. శాసనసభ స్థానాల పెంపుపై.. ఇనగంటి రవికుమార్ అనే వ్యక్తి చేసుకున్న దరఖాస్తు మేరకు.. ఎన్నికల సంఘం ఈ సమాచారాన్ని ఇచ్చింది. ఈ పరిస్థితుల్లో.. మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు.. చర్చనీయాంశమైంది.

ABOUT THE AUTHOR

...view details