గోపాల మిత్రలను విధుల నుంచి తొలగించమని మంత్రి మోపిదేవి వెంకటరమణ హామీ ఇచ్చారు.ఉద్యోగ భద్రత కల్పించాలని విజయవాడలో మూడు రోజులుగా నిరసన చేస్తోన్న దీక్షా శిబిరాన్ని మంత్రి మోపిదేవి వెంకటరమణ సందర్శించారు. 20సంవత్సరాలుగా పశుసంవర్ధక శాఖతో అనుసంధానమై ప్రభుత్వ పధకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్న గోపాల మిత్రలను తొలగించే ఆలోచనేది లేదని చెప్పారు.మిత్రాలకు చెల్లించాల్సిన8నెలల బకాయిల సీఎం జగన్మోహన్ తో చర్చించి చెల్లింపులు జరిగేలా కృషి చేస్తామన్నారు.
గోపాలమిత్రలను తొలగించం: మంత్రి మోపిదేవి - నిరసన
గోపాల మిత్రలను తొలగించే ఆలోచన ఏది లేదని మంత్రి మోపిదేవి వెల్లడించారు. గత 8 నెలల బకాయిలను చెల్లించేందుకు సిఎం చర్చిస్తానని ఆయన వెల్లడించారు.
గోపాల మిత్రల ఉద్యోగులకు భద్రతాని..మంత్రి హామి