ఏటా అంగరంగ వైభవంగా జరిగే ఉజ్జయిని మహంకాళి బోనాలు... కరోనా ప్రభావంతో ఈసారి నిరాడంబరంగా జరగనున్నాయి. కొవిడ్ నిబంధనల ప్రకారం ఆలయ పరిసరాల్లో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. ఇవాళ తెల్లవారుజాము 4 గంటలకు అమ్మవారికి ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. అమ్మావారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు.
ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు ప్రారంభం - ఉజ్జయిని మహంకాళీ బోనాలు ప్రారంభం
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ప్రారంభమైంది. కొవిడ్ కారణంగా భక్తులు లేకుండానే ఉత్సవాలు జరుగుతున్నాయి. రంగంలో ప్రధాన ఘట్టమైన భవిష్యవాణి, ఫలహారం బండ్ల ఊరేగింపుతో రేపు వేడుకలు ముగియనున్నాయి.
secundrabad-ujjaini-mahankali-bonalu-celebrations-started
ఉత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులకు, వీఐపీలకు అనుమతి లేదని ఆలయ ఈవో మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు. సాంప్రదాయబద్ధంగా, శాస్త్రీయంగా జరగాల్సిన పూజా కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగుతాయని పేర్కొన్నారు. రేపు రంగం కార్యక్రమంలోని ప్రధాన ఘట్టమైన భవిష్యవాణి, ఫలహారం బండ్ల ఊరేగింపుతో ఉత్సవం ముగుస్తుందన్నారు. భక్తులు ఆలయ పరిసరాల్లోకి రాకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి బందోబస్తు నిర్వహిస్తున్నారు.