ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పేద విద్యార్థులకు ఉపకారవేతనాలు, నోట్​పుస్తకాల పంపిణీ

విజయవాడలో అజిత్ సింగ్ నగర్​ వివేకానంద సెంటినరీ పాఠశాలలో.. అనంత లక్ష్మీదేవి సేవాసంఘం వారు విద్యార్థులకు నోట్ పుస్తకాలు, ఉపకారవేతనాలు పంపిణీ చేశారు.

పంపిణీ

By

Published : Jul 14, 2019, 11:16 PM IST

పేద విద్యార్థులకు ఉపకారవేతనాలు, నోట్​పుస్తకాల పంపిణీ

విజయవాడలో అనంత లక్ష్మీదేవి సేవాసంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉపకారవేతనాలు, నోట్‌బుక్స్‌, పేదలకు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అజిత్ సింగ్‌ నగర్‌ లోని వివేకానంద సెంటినరీ ఉన్నత పాఠశాల ఈ కార్యక్రమానికి వేదిక అయ్యింది. 24 సంవత్సరాలుగా సేవా మార్గంలో వెళ్లేందుకు స్ఫూర్తిని ఇచ్చిన మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కి ఘనంగా జన్మదినోత్సవం నిర్వహిస్తున్నట్లు అనంత లక్ష్మీదేవి సేవాసంఘం అధ్యక్షుడు అప్పలరాజు చెప్పారు. కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విజయవాడ మధ్య నియెజకవర్గ శాసనసభ్యుడు మల్లాది విష్ణు విచ్చేశారు. స్వామి వివేకానంద స్వామి విగ్రహానికి పూలమాలవేసిన అనంతరం... గోకరాజు గంగరాజు జన్మదినోత్సవ కార్యక్రమంలో భాగంగా, సేవాసంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 75 కిలోల కేక్‌ని కట్‌ చేయించారు. 10 వతరగతిలో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్ధులకు ప్రోత్సహాకాలు అందించారు. విద్యార్థులకు సేవాసంఘం తరుపున ఎమ్మెల్యే మల్లాది విష్ణు, గంగరాజులు నోట్‌పుస్తకాలను పంచిపెట్టారు. మాజీ ఎంపి గంగరాజుని, ఎమ్మెల్యే మల్లాది విష్ణును నిర్వహాకులు శాలువతో సత్కరించారు.

ABOUT THE AUTHOR

...view details