దుర్గమ్మ దర్శన టికెట్ల విక్రయాల్లో అవినీతి! విజయవాడ కనకదుర్గ ఆలయ దర్శన టికెట్ల విక్రయాల్లో అవినీతి బయటపడింది. ఒకె నంబర్‌తో అనేక దర్శన టికెట్లు అమ్ముడైన విషయాన్ని అధికారులు గుర్తించారు. అధిక రద్దీ రోజుల్లోనూ తక్కువ ఆదాయం రావడంతో అనుమానించిన ఈవో... నిఘా పెట్టారు. ఆదాయం తక్కువగా వస్తున్న విషయంపై వివరాలు తెలుసుకున్నారు. ప్రత్యేక బృందం ఏర్పాటు చేయించి వాస్తవాలు తెలుసుకున్నారు. లక్షలాది రూపాయల మేర ఆలయ ఆదాయానికి గండి పడి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారణ చేశారు.