ప్రజల కోసమే.. పాలన వికేంద్రీకరణ చేస్తున్నామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఏడాది పాటు చర్చించి నిర్ణయం తీసుకున్నామన్నారు. తెలుగుదేశం పార్టీ ఉద్దేశ పూర్వకంగానే.. పాలన వికేంద్రీకరణను అడ్డుకోవాలని చూస్తోందని ఆరోపించారు. బినామీలను రక్షించుకొనేందుకే అమరావతి ఉద్యమం చేయిస్తున్నారని సజ్జల ఆక్షేపించారు.
వేల కోట్లు కొల్లగొట్టే అవకాశం కొల్పవడంతో చంద్రబాబు అమరావతిని రాష్ట్ర సమస్యగా చిత్రీకరిస్తున్నారని ధ్వజమెత్తారు. అమరావతిలో 11 వేల మంది రైతులు ఉన్నారని వారికి ఎలా న్యాయం చేయాలన్నది.. సీఎం ఆలోచిస్తున్నారన్నారు. చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి.. లోకేష్ ను మంగళగిరిలో ఓడించారని.. సజ్జల పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏం విధ్వంసం జరిగిందో చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.