ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పర్యాటక కేంద్రాల్లో పెరుగుతున్న సందడి - ఏపీలో పర్యటక ప్రాంతాలు

మార్చిలో లాక్‌డౌన్‌ మొదలైనప్పటి నుంచి పూర్తిగా తగ్గిపోయిన పర్యాటకుల సంఖ్య ఇప్పుడిప్పుడే కాస్త పెరుగుతోంది. అన్‌లాక్‌-1 ప్రకటించినప్పటి నుంచి అన్నీ పర్యాటక ప్రాంతాల్లో సందడి మొదలైంది. ఈ సారి వర్షాలు పుష్కలంగా పడటంతో ప్రకృతి అందాలు, జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. వాటిని చూడాలనుకున్నవారు పర్యాటక ప్రాంతాలకు వస్తున్నారు.

పర్యాటక కేంద్రాల్లో పెరుగుతున్న సందడి
పర్యాటక కేంద్రాల్లో పెరుగుతున్న సందడి

By

Published : Oct 11, 2020, 5:20 AM IST

సాధారణంగా రాష్ట్రంలో పర్యాటకానికి అక్టోబరు-జనవరి మంచి సీజన్‌. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో చల్లని వాతావరణం ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. అయితే కొవిడ్‌ నేపథ్యంలో జులై వరకు పర్యాటకుల రాక 10శాతం మాత్రమే ఉంది. ఆ తర్వాత నెమ్మదిగా పెరుగుతూ సెప్టెంబరు ఆఖరుకు 30శాతానికి చేరింది. అక్టోబరు, నవంబరు నెలల్లో 50 నుంచి 60శాతానికి చేరుతుందని ఆ రంగ ప్రతినిధులు అంచనా వేస్తున్నారు. ఈ సీజన్‌లో పశ్చిమబంగ నుంచి మన రాష్ట్రానికి ఎక్కువ సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారని, మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అవకాశమూ ఉందని రాష్ట్ర పర్యాటక శాఖ అంచనా వేస్తోంది.

  • అనంతపురం జిల్లాలోని పెన్న అహోబిలంలో నరసింహస్వామి ఆలయం కిందభాగంలో అమ్మవారి పక్కనుంచి వెళుతున్న జలపాతం వద్దకు వారంలో 1200 నుంచి 1500 మంది వస్తున్నారు. అనంతపురం జిల్లాలోని ‘యాడికి కోన జలపాతం’ వద్ద సందడి చేసేందుకు వారాంతంలో సగటున వేయిమంది వస్తున్నారు.
  • విశాఖ, చిత్తూరు, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్టోబరు నెలకు హోటల్‌, రిసార్టుల్లో గదులు ఇప్పటికే బుక్‌ అయిన పరిస్థితి.

జలక్రీడలు సిద్ధం

విశాఖపట్నంలో పర్యాటకాభివృద్ధి సంస్థ(ఏపీటీడీసీ)కు ప్రతి నెలా సగటున రూ.3కోట్ల ఆదాయం వచ్చేది. కొవిడ్‌ వ్యాప్తి, లాక్‌డౌన్‌లో ఆదాయమే లేదు. జూన్‌-8న అన్‌లాక్‌-1 ప్రకటనతో కార్యకలాపాలు ప్రారంభించినా రాబడి అంతగా లేదు. జులైలో 10శాతం, సెప్టెంబరులో 35శాతం వచ్చింది. ఈ సారి విశాఖ బీచ్‌లో పారాగ్లైడింగ్‌, స్కూబాడైవింగ్‌ వంటి జలక్రీడలు ప్రారంభిస్తుండటంతో ఆదాయం ఇంకా పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇదీచదవండి

ఉప్పాడ ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి పచ్చజెండా

ABOUT THE AUTHOR

...view details