మతం ఆధారంగా ఉప ప్రణాళికలు అమలుచేయడం రాజ్యాంగ విరుద్ధమని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు. మైనార్టీ సబ్ ప్లాన్ అమలును వైకాపా ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విజయవాడ భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మైనారిటీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం హిందూమతాన్ని అవమానించి అన్యమతస్థులను అందలం ఎక్కించడం మానుకోవాలని హితవు పలికారు. విభజించి పాలించే మత రాజకీయాల కోసం ఇలాంటి ఆలోచన చేస్తే ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక అమలుచేయకుండా వారికి అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అల్పసంఖ్యాక వర్గాలకు సబ్ ప్లాన్ అమలు చేయడం రాజ్యాంగ విరుద్ధమైన ఆలోచన. ఇలాంటి ఆలోచనను వైకాపా వెంటనే మానుకోవాలి. మతరాజకీయాల కోసం ఇటువంటి ఆలోచనలు చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం భాజపా నుంచి వ్యతిరేకత ఎదుర్కోవలసి వస్తుంది.