అనంతపురం జిల్లా గుంతకల్లులోని దక్షిణ మధ్య రైల్వే కార్యాలయంలో అధికారుల సమావేశమయ్యారు. డీఆర్ఎం, జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు, టీసీలు, వివిధ స్టేషన్ల పోలీసు అధికారులు పాల్గొన్నారు. వేసవి సెలవుల్లో ప్రయాణికులు ఎక్కువగా రైళ్లపై ఆధారపడి ప్రయాణిస్తుంటారని.. వారి భద్రత కోసం అందరూ కలిసి పనిచేయాలని కోరారు. రాత్రివేళల్లో, తెల్లవారుజామున జరిగే దొంగతనాలు, దోపిడీలను అరికట్టాలని జిల్లా ఎస్పీ, రైల్వే ఎస్పీ, డీఆర్ఎం సూచించారు. సాంకేతికతను వినియోగించుకుని దొంగలను సులభంగా కనిపెట్టవచ్చని తెలిపారు. వీటికి సంబంధించి ప్రత్యేక విధానాలను రూపొందించామన్నారు. సిగ్నలింగ్ వ్యవస్థను పాడు చేసి దోపిడీలకు పాల్పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. రైళ్లల్లో టీసీలు.. పోలీసులకు సహకరించాలని కోరారు. ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణించేలా చూడాలన్నారు. రాత్రి సమయాల్లో రైళ్లు స్టేషన్ బయట ఆగినప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు.
గుంతకల్లు రైల్వే కార్యాలయంలో అధికారుల సమావేశం - trains
గుంతకల్లులో దక్షిణ మధ్య రైల్వే కార్యాలయంలో రైల్వే అధికారుల సమావేశం జరిగింది. వివిధ అంశాలపై చర్చించారు.
సమావేశం