ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'విశాఖ రైల్వే జోన్​ ఏర్పాటుకు ఎలాంటి నిర్దిష్ట కాలవ్యవధి లేదు' - రైల్వే బోర్డు వార్తలు

Visakha Railway Zone: విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి ఎలాంటి నిర్దిష్టమైన కాలవ్యవధి లేదని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. అలాగే రాయగడ రైల్వే డివిజన్ తూర్పుకోస్తా రైల్వే జోన్​లో అంతర్భాగంగా ఉంటుందని పేర్కొంది.

central on Visakha Railway Zone
central on Visakha Railway Zone

By

Published : Mar 10, 2022, 5:16 AM IST

విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి ఎలాంటి నిర్దుష్టమైన కాలవ్యవధి లేదని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. ఈమేరకు నూతనంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి ప్రణాళికలు, ముందస్తు కార్యాచరణ కోసం ప్రత్యేకంగా ఓ అధికారిని ఇప్పటికే నియమించామని.. విశాఖ రైల్వే స్టేషన్ నుంచి ఆయన కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు తెలిపింది. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి సమాచార హక్కు చట్టం కార్యకర్త ఇనుగంటి రవికుమార్ అడిగిన సమాచారానికి రైల్వే బోర్డు జవాబు ఇచ్చింది.

సౌత్ కోస్టల్ రైల్వే జోన్, రాయగడ డివిజన్ ఏర్పాటు కోసం డీపీఆర్​ల రూపకల్పన ఇంకా అధ్యయనంలో ఉన్నట్టు వెల్లడించింది. కొత్త జోన్ కార్యకలాపాల కోసం ఎలాంటి నిర్ధిష్టమైన కాలవ్యవధిని నిర్దేశించలేదని స్పష్టం చేసింది. తూర్పుకోస్తా రైల్వేలో కొత్త జోన్ ఏర్పాటు, రాయగడ డివిజన్ ఏర్పాటు కోసం 2020-21, 2021-22, 2022-23 ఆర్థిక సంవత్సరాలకు రూ. 170 కోట్లు కేటాయించామని.. అయితే ఎలాంటి వ్యయం చేయలేదని వెల్లడించింది. నూతనంగా ఏర్పాటు చేయబోయే రాయగడ రైల్వే డివిజన్ తూర్పుకోస్తా రైల్వే జోన్​లో అంతర్భాగంగా ఉంటుందని స్పష్టం చేసింది.

ABOUT THE AUTHOR

...view details