ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దమ్ముంటే ఆరోపణలు నిరూపించండి: లోకేష్ సవాల్ - దమ్ముంటే ఆరోపణలు నిరూపించండి:ట్విట్టర్లో లోకేష్ సవాల్

వైకాపా నాయకులపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విటర్​ వేదికగా మరోసారి మండిపడ్డారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. దమ్ముంటే ఆ ఆరోపణలను రుజువు చేయాలని సవాల్ విసిరారు.

దమ్ముంటే ఆరోపణలు నిరూపించండి:ట్విట్టర్లో లోకేష్ సవాల్

By

Published : Jul 28, 2019, 1:16 PM IST

దమ్ముంటే ఆరోపణలు నిరూపించండి:ట్విట్టర్లో లోకేష్ సవాల్
రాజధానిలో ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ జరిగిందంటూ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యాలపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ మండిపడ్డారు. వైకాపా నాయకులు ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నామనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా వారి బతుకు మారలేదని... అసత్యాలతో కాలం నెట్టుకొస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని దెబ్బతియ్యడానికి అనవసర ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తండ్రి అధికారాన్ని, శవాన్ని పెట్టబుడిగా పెట్టుకుని ఎదిగిన చరిత్ర వైకాపా నాయకుడిదని ఘాటుగా వ్యాఖ్యానించారు. తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నా ఏ రోజు కూడా అటువైపు చూడకుండా స్వచ్ఛమైన మనసు, నీతి, నిజాయితీతో బాలకృష్ణ ఎదిగారని చెప్పారు. అటువంటి వ్యక్తి రాజధానిలో భూములు కొనుగోలు చేశారని చేస్తున్న ఆరోపణలను దమ్ముంటే నిరూపించాలని సవాల్‌ చేశారు. లేకపోతే రాజధాని రైతులకు, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details