ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జగన్​ ఇచ్చిన హామీ నెరవేర్చాలని 104 ఉద్యోగుల ఆందోళన

104 ఉద్యోగులను వైద్య ఆరోగ్యశాఖలో పీహెచ్​సీ అసుపత్రిలో ఖాళీలలో కాంట్రాక్ట్ పద్ధతిన నియామిస్తామని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఇచ్చిన హామిని అమలు చేయాలని.. ఏపీ 104 ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్​లో ఉద్యోగులు నిరసన చేశారు.

Protest to hire 104 employees as contract at vijayawada
104 ఉద్యోగులను కాంట్రక్ట్​గా నియమించాలని నిరసన

By

Published : Dec 16, 2020, 4:38 PM IST

గ్రామీణ వైద్య విభాగంలో సేవలందిస్తున్న 104లోని వివిధ క్యాడర్ ఉద్యోగులను వైద్య ఆరోగ్యశాఖలోని పీహెచ్​సీ, హాస్పిటల్స్ తదితర విభాగాల్లోని ఖాళీలలో కాంట్రాక్ట్ పద్ధతిన నియమించాలని డిమాండ్​ చేస్తూ ఆంధ్రప్రదేశ్ 104 ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్​లో ఉద్యోగులు నిరసనకు దిగారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.

104లో విధులు నిర్వహిస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్ట్స్​, ఏఎన్ఎం, స్టాఫ్ నర్సులు, వాచ్​మెన్ కేడర్ల ఉద్యోగులకు జీవో నెంబర్ 27 ప్రకారం వేతనాలు చెల్లించాలని.. 104 ఎన్ఎంయూ డ్రైవర్ల వేతనాలను రూ.26 వేలకు పెంచాలని...ఆప్కాస్ ద్వారా నియమించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

వెలువోలులో పాము కాటుతో చిన్నారి మృతి

ABOUT THE AUTHOR

...view details