జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడిగా పోతిన మహేశ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు పోతిన ధన్యవాదాలు తెలిపారు. తనకు పదవి ఇవ్వడం అంటే బలహీనవర్గాలను గుర్తించడమేనని అభిప్రాయపడ్డారు. పార్టీ కేటాయించిన పదవుల్లో 50 శాతం బీసీ, ఎస్సీ, ముస్లింలకు కేటాయించడం హర్షణీయమన్నారు. కమిటీల కూర్పులో మహిళలకు, యువతకు పెద్ద పీట వేసిన పవన్ కళ్యాణ్‌కు రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల దగ్గర నుంచి మద్దతు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
'నాకు పదవి ఇవ్వడం అంటే బలహీనవర్గాలను గుర్తించడమే' - జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు పోతిన మహేశ్
జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడిగా పోతిన మహేశ్‌ను నియమించారు పవన్ కల్యాణ్. ఈ సందర్భంగా పార్టీ అధినేతకు పోతిన ధన్యవాదాలు తెలిపారు.
పోతిన మహేశ్
జీవో నెంబర్ 2 రద్దు ప్రభుత్వానికి చెంపదెబ్బని విమర్శించారు. సీఎం జగన్ ఇకనుంచైనా నియంతృత్వ పోకడలు మానేసి ప్రజాస్వామ్యబద్ధంగా పాలన చేయాలని హితవు పలికారు.
ఇదీ చదవండి:Pothina Mahesh : 'పత్రికా ప్రకటన లేకుండా ఉద్యోగాలు ఎలా భర్తీ చేస్తారు..?'