ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు.. మంత్రి శంకరనారాయణ శాఖ మార్పు

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/22-July-2020/8132613_753_8132613_1595431923566.png
http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/22-July-2020/8132613_753_8132613_1595431923566.png

By

Published : Jul 22, 2020, 8:28 PM IST

Updated : Jul 22, 2020, 9:17 PM IST

20:27 July 22

కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల్​లకు శాఖలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రి శాఖ నారాయణ శాఖను మార్చింది.

కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల్​లకు శాఖలు కేటాయిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. చెల్లుబోయిన వేణుగోపాల్​కు బీసీ సంక్షేమశాఖను కేటాయించారు. అలాగే సీదిరి అప్పలరాజుకు పశుసంవర్ధక, మత్స్యశాఖలు అప్పగించారు. ఇక బీసీ సంక్షేమశాఖ మంత్రిగా ఉన్న మాలగుండ్ల శంకరనారాయణకు రహదారులు, భవనాల శాఖను అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకూ రహదారులు, భవనాల శాఖ బాధ్యతలు చూసిన ధర్మాన కృష్ణదాస్​కు ఉపముఖ్యమంత్రిగా పదోన్నతి కల్పించిన సీఎం జగన్  ఆయనకు రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖను అప్పగించారు.

ఇదీ చదవండి: మంత్రులుగా ప్రమాణం చేసిన అప్పలరాజు, వేణుగోపాల్​

Last Updated : Jul 22, 2020, 9:17 PM IST

ABOUT THE AUTHOR

...view details