హైదరాబాద్ శిల్పారామంలో సంక్రాంతి సంబురాలు - శిల్పారామం... సంక్రాంతి సంబురాలమయం
హైదరాబాద్ శిల్పారామం సంక్రాంతి సంబురాలతో రంగులీనుతోంది. రంగురంగుల ముగ్గులు, గంగిరెద్దు విన్యాసాలతో సందడిగా మారింది. సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన గిరిజనులు డప్పు చప్పుళ్ల మధ్య కాలు కదిపారు. హరిదాసుల గానం, పిట్టల దొర ముచ్చట్లతో శిల్పారామ ప్రాంగణం కిటకిటలాడుతోంది. వారం రోజుల పాటు సంక్రాంతి వేడుకలతో శిల్పారామం విరాజిల్లనుంది.
హైదరాబాద్ శిల్పారామంలో సంక్రాంతి సంబురాలు
.