ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవద్దు.. వైకాపాకు ప్రతిపక్షాల హెచ్చరిక

By

Published : Feb 6, 2021, 10:47 PM IST

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ యత్నాల ద్వారా రాష్ట్ర ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవద్దని రాజకీయ పార్టీల నేతలు హెచ్చరించారు. ఒక ముఖ్యమంత్రిగా జగన్‌ ఏం చేస్తున్నారని ప్రతిపక్షనేత చంద్రబాబు నిలదీశారు. విశాఖలో అన్నీ తానై వ్యవహరిస్తున్న విజయసాయి రెడ్డి రాజీనామా చేయాలని తెలుగుదేశం, వామపక్షాలు డిమాండ్‌ చేశాయి.

left parties  fire on steel privatization efforts
ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవద్దంటూ వైకాపాకు ప్రతిపక్షాల హెచ్చరిక

ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవద్దంటూ వైకాపాకు ప్రతిపక్షాల హెచ్చరిక

విశాఖ ఉక్కుపై స్పందించొద్దంటూ సీఎం జగన్‌ వైకాపా ఎంపీల నోరు కుట్టేశారని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆరోపించారు. ప్రత్యక్షంగా 40 వేలు, ప‌రోక్షంగా ల‌క్ష మందికి ఉపాధి క‌ల్పించే విశాఖ ఉక్కుని ప్రైవేట్ ప‌రం చేస్తుంటే... ఒక ముఖ్యమంత్రిగా ఏం చేస్తున్నారని ఆయన నిలదీశారు. గతంలో వాజ్‌పేయీ ప్రభుత్వంలో ఇదే పరిస్థితి వస్తే, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి విశాఖ ఉక్కును కాపాడామని గుర్తు చేసుకున్నారు. ఈ అంశంపై విజయవాడ దాసరి భవన్‌లో వివిధ పార్టీలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి. విశాఖను అభివృద్ధి చేస్తామంటున్న విజయసాయిరెడ్డి.. రాజీనామా చేయాలని నేతలు డిమాండ్‌ చేశారు.

ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వేళ... పార్లమెంటులో వైకాపా ఎంపీలు ఈ అంశంపై ఎందుకు మాట్లాడలేదని తెదేపా నేతలు నిలదీశారు. విశాఖ ఉక్కు పరిరక్షణకు దీర్ఘకాలిక పోరాటానికి సిద్ధమని పీసీసీ అధ్యక్షుడు శైల‌జానాథ్‌ అన్నారు. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అంటూ ఒకప్పుడు పోరాటం చేసిన వెంకయ్య నాయుడిని అంశంపై ప్రశ్నించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి:పార్టీలకు అతీతంగా విశాఖ నేతలంతా రాజీనామా చేయాలి: గంటా

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details