ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్లాస్టిక్​ని నిషేధించాలంటూ.. విద్యార్థులు, అధ్యాపకుల ర్యాలీ

పర్యావరణ పరిరక్షణ దిశగా.. ఈనాడు, ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో.. రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు జరిగాయి. ప్లాస్టిక్​తో కలిగే నష్టాన్ని ప్రజలకు వివరించారు.

By

Published : Oct 1, 2019, 2:59 PM IST

Published : Oct 1, 2019, 2:59 PM IST

ప్లాస్టిక్​ని నిషేధించాలంటూ.. విద్యార్థులు, అధ్యాపకుల ర్యాలీ

ప్లాస్టిక్​ని నిషేధించాలంటూ.. విద్యార్థులు, అధ్యాపకుల ర్యాలీ

జిల్లాలో వివిధ కళాశాలల నుంచి విద్యార్థులు, అధ్యపకులు ఈనాడు ఈటీవీ-భారత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రకాశం జిల్లాలో రంగరాయుడు చెరువు గాంధీ బొమ్మ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఎంఈ సుందర రామి రెడ్డి, పర్యాటక శాఖ జిల్లా అధికారి నాగ భూషణం, లైన్స్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా విజయవాడలో ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దటమే తమ లక్షమని కలెక్టర్ ఇంతియాజ్ వెల్లడించారు.కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ఐటీసీ, వెల్ బీయింగ్ అవుట్ ఆఫ్ వేస్టేజ్ ఆధ్వర్యంలో నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో అవగాహన కార్యక్రమం చేపట్టారు. విజయనగరం జిల్లా ఎస్.కోట పట్టణంలో ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలపై ర్యాలీ అవగాహన సదస్సు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో మహేంద్ర డిగ్రీ కళాశాలలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details