కృష్ణా జిల్లా గన్నవరంలో కొవాగ్జిన్ రెండో డోసు తీసుకునేందుకు భారీగా ప్రజలు చేరుకున్నారు. స్థానిక బాలుర జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కరోనా టీకా కేంద్రం వద్ద భారీగా క్యూ కట్టారు. గత రెండురోజులుగా కొవిషీల్డ్ అందజేసిన అధికారులు ఇవాళ కోవాగ్జిన్ పంపిణీ చేస్తున్నారు.
రేపటి నుంచి కొవాగ్జిన్ ఇస్తారో లేదోననే అనుమానంతో.. పరిసర ప్రాంతాల ప్రజలు అక్కడికి భారీగా చేరుకున్నారు. వైద్యులు క్యూలో నిల్చున్న ప్రజలకు ముందస్తుగా టోకెన్లు జారీచేశారు. పంపిణీ కేంద్రంలో ఏర్పాట్లను స్థానిక పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.