ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ విడుదల చేయాలి: పీడీఎస్​యూ - iiit notification

ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్​యూ ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ కూడలిలో విద్యార్థులు ధర్నా చేపట్టారు.

పీడీఎస్​యూ ధర్నా

By

Published : Jun 11, 2019, 5:03 PM IST

పీడీఎస్​యూ ధర్నా

రాష్ట్రంలో పదవ తరగతి ఫలితాలు వచ్చి సుమారు 20 రోజులు గడుస్తున్నా...ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేయలేదని పీడీఎస్​యూ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ట్రిపుల్ ఐటీ, ఎంసెట్ ప్రవేశాలకై నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడ లెనిన్ కూడలిలో ధర్నాకు దిగారు. ప్రభుత్వ వైఖరితో విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని, హైకోర్టులో కేసు పెండింగ్​లో ఉందన్న సాకుతో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. తక్షణమే ట్రిపుల్ ఐటీ సీట్ల సంఖ్యను పెంచి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details