సామాన్య కుటుంబంలో పుట్టి.. అసాధారణ వ్యక్తిగా మారిన చిరంజీవి... తనతో పాటు ఎందరికో స్ఫూర్తిప్రదాత అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తన అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన పవన్... శ్రమైక జీవనమే చిరంజీవి విజయానికి సోపానమన్నారు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్న పెద్దల మాటలు చిరంజీవిని చూస్తే నిజమనిపిస్తాయని... అటువంటి కృషీవలునికి తమ్ముడిగా పుట్టడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.
కృషీవలుడికి తమ్ముడిగా పుట్టడం నా అదృష్టం: పవన్ - చిరంజీవికి పుట్టినరోజు వార్తలు
శ్రమైక జీవనమే తన అన్నయ్య చిరంజీవి విజయానికి సోపానమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. సోదరుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన పవన్ ….సామాన్య కుటుంబంలో పుట్టి.. అసాధారణ వ్యక్తిగా మారారని కొనియాడారు.
చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్
అన్నయ్య చేయిపట్టుకుని పెరిగానని... ఒక విధంగా చెప్పాలంటే అన్నయ్యే తన తొలి గురువని ఆయనపై ఉన్న ప్రేమను చాటుకున్నారు పవన్. కోట్లాది మంది అభిమానుల గుండెల్లో చిరస్మరణమైన స్థానాన్ని సంపాదించారని ప్రశంసించారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అలవరుచుకున్నారని కొనియాడారు. అన్నయ్య చిరంజీవికి చిరాయువు ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.
ఇవీ చదవండి:మెగాస్టార్.. మీరే మా స్ఫూర్తి, ధైర్యం