ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సుందర భరితం... బెజవాడ నగరం - విజయవాడ

ఎండవేడిమితో ఆపసోపాలు పడుతున్న నగర వాసులకు సంధ్యవేళ సేదతీరమంటూ ఆహ్వానం పలుకుతున్నాయి ఉద్యానవనాలు. వినోదం, విజ్ఞానం, వ్యాయామాన్ని ఒకే చోట అందిస్తూ... అద్భుతః అనిపిస్తున్నాయి. ఉన్న పార్కులను అభివృద్ధి చేయడంతోపాటు... అమృత పథకం కింద నూతన ఉద్యానవనాలను ఏర్పాటు చేస్తున్నారు.

బెజవాడకు ఆహ్లాదాన్ని పంచుతున్న పార్కులు

By

Published : May 12, 2019, 6:59 PM IST

విజయవాడ మహానగరంలో ఉద్యానవనాలు నగరవాసులను ఆకర్షిస్తున్నాయి. పగలంతా భానుడి తాపానికి బయటకురాలేకపోతున్న జనం... సాయంత్రం పిల్లలతో కలిసి ఉద్యానవనాల బాట పడుతున్నారు. ఒకప్పుడు పార్కులంటే కేవలం సేదతీరడానికే అనువుగా ఉండేవి. ఒక పక్క చిన్నారులు ఆడుకునేందుకు, మరో పక్క పెద్ద వారు వ్యాయామం చేసుకునేందుకు వీలుగా ఉద్యానవనాలు అభివృద్ధి చేశారు.

బస్టాండుకు సమీపంలో ఉండే అవతార్​పార్కు, స్క్రాప్​పార్క్​తోపాటు దుర్గా పైవంతెన కింది భాగంలో అభివృద్ధి చేసిన ఎఫ్​1 హెచ్​టువో పార్కు ఆహ్లాదాన్ని పంచుతోంది. ఇవన్నీ ఒకెత్తైతే... గొల్లపూడిలోని సితార కూడలి నుంచి గొల్లపూడి కూడలి వరరూ 1.2 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేసిన ఉద్యానవనం మరింత ప్రత్యేకం. అమృత్ పథకంలో ఈ వనాన్ని 8 భాగాలుగా విభజించి... వైవిధ్యంగా తీర్తిదిద్దుతున్నారు.

కొత్తగా నిర్మించే పార్కుల్లో నడక కోసం ఇసుక దారులు వేస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళలో పెద్దవాళ్లు నడిచేందుకు, చిన్నారులు ఆడుకునే ఏర్పాట్లు చేశారు. వ్యాయామం చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. అధునాతనంగా రూపొందుతున్న వనాలకు అన్ని వయసుల వారూ తరలి వస్తున్నారు. రాత్రి 8 గంటల వరకూ పార్కుల్లోనే గడుపుతూ ఆహ్లాదం, ఆరోగ్యాన్ని పొందుతున్నారు.

బెజవాడకు ఆహ్లాదాన్ని పంచుతున్న పార్కులు

ఇదీ చదవండి...

అమ్మ మనోధైర్యం... తనయుడికదే ఆత్మవిశ్వాసం....

ABOUT THE AUTHOR

...view details